* వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
* వేములవాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
సిరిసిల్ల, డిసెంబర్ 22( విజయ క్రాంతి):రైతులకు అందుబాటులో ఉంటు మెరుగైన సేవలు అందించాలని వేముల వాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ అతి శ్రీనివాస్ అన్నారు. వేములవాడ వ్యవసాయ మార్కె ట్ కమిటీలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవములో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతు ప్రభుత్వంగా పేరిందిన కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవ లందించాలన్నారు. అంతకుముందు చైర్మన్ రెడ్డి రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపురు రాజేష్ లతోపాటు డైరెక్టర్ లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలువుతీరిన కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వ విప్ శాలువాలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.