calender_icon.png 16 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు వ్యవసాయ అధికారులు రుణమాఫీపై అవగాహన కల్పించాలి

11-09-2024 10:22:01 AM

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి 

మంథని (విజయకాంతి): రైతులకు రుణమాఫీ పై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి వ్యవసాయ అధికారులను కోరారు. మంథని లోని వ్యవసాయ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు లక్షలు రుణమాఫీ కానీ రైతుల లిస్ట్ సేకరించి, వారికీ కూడా రుణమాఫీ అయ్యేలా ప్రయత్నించాలని, బ్యాంకు మేనేజర్లను, మంథని ఏడిఏ అంజనీ ని సురేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మంథని మండల అధ్యక్షులు అర్థం సదానందం యాదవ్, కిసాన్ సెల్ ఎక్లాస్ పూర్ గ్రామశాఖ అధ్యక్షులు నాంపల్లి సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోకల మల్లేష్, దండిగా సమ్మయ్య, నాగుల రాజయ్య, పర్శవేనా మోహన్, జంగమ సడవాలి, రాధారపు నితీష్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.