13-03-2025 12:15:42 AM
చేర్యాల, మార్చి 12: తపస్ పెళ్లి రిజర్వాయర్ నింపి, రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి అన్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఎండిన పంటలను పరిశీలించడంతోపాటు తపస్పల్లి రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఇద్దరూ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
ఇద్దరికీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైనారన్నారు. 15 రోజుల నుంచి నీళ్లు ఇగొచ్చే, అగొచ్చే అని చెప్తున్నారు తప్ప నీటిని మాత్రం విడుదల చేయించడం లేదన్నారు. ఎండిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు.
లేనిపక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రైతులను కూడా గట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. క్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బూర్గోజు నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్ దండు బాల్ చందర్, దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు.