calender_icon.png 7 March, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సాగునీరు ఇవ్వాలి

07-03-2025 12:00:00 AM

 చేర్యాల, మార్చి 6:  తపాస్ పల్లి రిజర్వాయర్ నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముత్యం నరసింహులు, ఎరుపుల మహేష్ లు అన్నారు. కొమురవెల్లి మండలంలో ఎండిపోయిన పంటలను బిఆర్‌ఎస్ బృందం గురువారం పరిశీలించింది. సందర్భంగా వారు మాట్లాడు తూ భూగర్భ జలాలు అడుగంటిపోయి, రైతులు వేసిన పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తపాస్ పల్లి రిజర్వాయర్ నీటిమీద ఆధారపడే రైతులు పంటలు వేశారన్నారు.

ప్రభుత్వానికి చూపు కొరవడే పంటలు ఎండిపోతున్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిజర్వాయర్ లోకి వచ్చే నీటిని త్వరగా పంపింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఎంత త్వరగా నీటిని అందిస్తే రైతులకు ఉపయోగపడుతుందని వారు సూచించారు. లేని యెడల రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుందన్నారు. త్వరగా నీటిని విడుదల చేయకపోతే బిఆర్‌ఎస్ పక్షాన రైతులను కూడాఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు గొల్లపల్లి కిష్టయ్య, కనక చారి, కొండా శ్రీధర్ పాల్గొన్నారు.