calender_icon.png 17 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఒప్పించి భూమి తీసుకోవాలి

17-11-2024 01:05:06 AM

బీఆర్‌ఎస్ మహిళా నేత తుల ఉమ

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్న ప్రజలను ఒప్పించి భూములు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మహిళా నేత తుల ఉమ పేర్కొన్నా రు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం రైతు ల నుంచి భూములను బెదిరించి తీసుకుంటుందన్నారు. తనపై దాడి జరగలేదని కలెక్టర్ చెబుతున్నా కేసులు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు.

బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం ఉందని, అక్క డి ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పినా రాత్రి వేళ వందల మంది ఇండ్లల్లోకి వచ్చి దాడులు చేశారని అమె మండిపడ్డారు.