calender_icon.png 22 December, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 ఎకరాల వరకు రైతుభరోసా ఇవ్వాలి

22-12-2024 02:22:30 AM

హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): పదిహేను ఎకరాల వరకు రైతుభరోసా ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. శనివారం అ సెంబ్లీలో రైతుభరోసాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, వ్యవసాయేతర భూములకు ఇవ్వొద్దన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి బడ్జెట్ అదా అవుతుందన్నారు. వ్యవసాయం భూమి ఎంత ఉందో లెక్క తీయాలన్నారు.