- భూస్వాములు, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారిని మినహాయించాలి
- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభరెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రైతు భరోసా పథకాన్ని ఐ దు ఎకరాలు వరకు వ్యవసాయ భూ ములకే ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి కోరా రు. ఈమేరకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల రైతు భరోసాపై ఏర్పాటు చేసిన ఉపసంఘం ఇ చ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు.
కేంద్రప్రభుత్వం పీ ఎం కిసాన్ యోజన కింద 5 ఎకరా ల లోపు రైతులకు ఇచ్చే సాయా న్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచిందని, రైతులకు కావాల్సిన ఎరువులపై సబ్సిడీ ఇస్తూ, ఎరువుల ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు పంట నష్టపో యినప్పుడు ఫసల్ బీమా పథకం ద్వారా ఆదుకునే ప్రయత్నా లు చేస్తుందని, వ్యవసాయం కోసం రైతులకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుందన్నారు.
రైతులు చనిపోయినా, రైతు బీమా పథక ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చె ప్పారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పన బోన స్ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
గత ప్రభు త్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేసిందని, కానీ అందులో వ్యవసాయం చేయని పడావు భూము లు, వందల ఎకరాలు ఉన్న పెద్ద భూస్వాములకు కూడా సాయం అందించడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందన్నారు. రేవంత్ సర్కార్ అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, బడా భూ స్వాములు, ఆదాయపు పన్ను చెల్లిం చే శ్రీమంతులను ఈపథకం నుంచి దూరం చేయాలని సూచించారు.