28-04-2025 03:49:59 PM
దోమకొండ పశువైద్య సహాయ సంచాలకులు శ్రీనివాస్
కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులు పశుగ్రాస కొరతను నివారించడానికి కామారెడ్డి జిల్లా దోమకొండ పశు వైద్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం దోమకొండ లో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరై అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. వేసవిలో పశు గ్రాస కొరత నివారణ కొరకు రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు తనకున్న భూమి లో కొంత భూమిని, పశుగ్రాస సాగుకు వదిలిపెట్టాలనీ,
వర్షాకాలంలో పశుగ్రాసలు సాగు చేసుకుని, పశుగ్రాస కట్టింగ్ యంత్రం ద్వారా ముక్కలు చేసుకుని ఆరబెట్టి సంచులలో నిలువ చేసుకున్న గ్రాసం ను పశుగ్రాసం దొరకనీ సమయంలో పశువుల కు మేతగా ఇవ్వవలెను. వరి కోత యంతల ద్వారా కత్తిరించిన వరి వృధాగా పోకుండా బిల్లింగ్ యంత్రాల ద్వారా బేలింగ్ చేసుకొని బిల్డింగ్ కట్టలు నిల్వ ఉంచుకొని పశుగ్రాసం దొరకని సమయంలో పశువులకు మేతగా వాడుకోవచ్చు రైతులకు ఏక వార్షిక పశుగ్రాసాలు మరియు బహు వార్షిక పశుగ్రాసాలను పెంచుకోవాలని, నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఏక వార్షిక పశుగ్రాసాలైనా జొన్న రకాలు బిసి 23, ఎస్ హెచ్ జి 59-3 మొక్కజొన్న రకాలు పెంచుకోవాలనీ, సుబాబుల చెట్లు పెంచుకోవాలనీ అన్నారు, అజోల గడ్డిని సాగు చేసుకోవాలని పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ రైతులకు పలు సూచనలు చేశారు.