calender_icon.png 18 April, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యంవహిస్తే రైతులు మరో పోరాటానికి సిద్ధం

26-03-2025 12:40:31 AM

- హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో  వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ మార్చి (విజయ క్రాంతి) : నిర్లక్ష్యం వహిస్తే రైతులు మరో పోరాటానికి సిద్ధమవుతారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో  వడగండ్ల వాన కు దెబ్బతిన్న పంటలను ప్రత్యేకంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు.

వడగండ్ల వానతో రైతుల చేతికి వచ్చిన పంట చేజారిపోయిందని, తీర నష్టం వాటిల్లిందని ఎకరా కు 40,000 చొప్పున నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని చెప్పారు.

అనంతరం ఇటీవల మరణించిన పెద్దదర్పల్లి బీఆర్‌ఎస్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు తేజ వర్ధన్ నానమ్మ కుటుంబ సభ్యులను, హైదరాబద్ లో చెత్త తరలిస్తూ ఉండగా పేలి మృతి చెందిన నాగన్న కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, రైతు కమిటీ అధ్యక్షులు కొండ లక్ష్మయ్య, సీనియర్ నాయకులు నెత్తికొప్పుల శ్రీను, చెన్నయ్య, జంబులయ్య, పెద్ద చెన్నయ్య, రాజుయాదవ్, అనంత రెడ్డి , బాలకిష్టయ్య, హరీష్ చందర్, వెంకన్న, మాధవులు,  శ్రీనివాసులు, వెంకటయ్య, తిరుపతయ్య, బలవర్దన్ , రామకృష్ణ తదితరులు ఉన్నారు.