08-02-2025 01:29:08 AM
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి7: ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని రుద్ర శివ పారాబైల్డ్ రైస్ మిల్లు నిర్మించడం వల్ల అందులో నుంచి వచ్చే దుమ్ము ధూళితో చుట్టుపక్కల ఉన్న 180 ఎకరాల వరి పంట నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న జిల్లా సివిల్ సప్లు అధికారి వసం తలక్ష్మి, స్థానిక తహాసిల్దార్ రామచందర్, ఆర్‌ఐ సంతోష్‌లు రైస్ మిల్ వద్దకు చేరుకొ ని రైతుల ద్వారా విషయం తెలుసుకున్నారు. సుమారు 120 మంది రైతులు రైస్ మిల్ నిర్మాణాన్ని ఆపాలని ఆందోళన కు దిగారు.
చుట్టుపక్కల ఉన్న 180 ఎకరాల వరి,పత్తి మొదలగును పంటలు వేసుకొని సాగు చేస్తు న్నామని పారాబైల్డ్ రైస్ మిల్లులో నుంచి వచ్చే దుమ్ము దులితో పంటలలో పేరుకుపో యి దిగుబడి రాక తీవ్ర నష్టం వాటిల్లుతుం దని అధికారులతో రైతులు పేర్కొన్నారు. రైస్ మిల్ నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించి యజ మానికి రైస్ మిల్ నిర్మాణాన్ని ఆపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే పక్కనే ఉన్న రైస్ మిల్ నుంచి వరి ధాన్యపు గింజల పొట్టు పంట పొలంలో పడకుండా డంపింగ్ యార్డ్ నిర్మించుకోవాలన్నారు.