18-03-2025 02:55:38 PM
చేగుంట: సాగునీటి కాలువ కోసం గజ్వెల్ నుండి చేగుంటకి వచ్చే దారిని చిన్న శివనూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, ఎస్ఐ ఇరిగేషన్ డిఈతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... రామాయంపేట వెల్ కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్ల ఇవ్వండి. మా గ్రామాల ప్రజలు బతుకుతారని ఎన్ని సార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అలాగే అధికారులకు విన్నవించిన ఎవరు పట్టించుకోలేదని రైతులు వాపోయ్యారు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దీనిపైన వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న శివనూర్ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు