calender_icon.png 23 January, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28న నల్లగొండలో రైతుధర్నా

23-01-2025 01:14:07 AM

అనుమతించిన హైకోర్టు 

హైదరాబాద్,జనవరి 22 (విజయ క్రాంతి) : నల్లగొండ క్లాక్ టవర్ వద్ద ఈనెల 28న బీఆర్‌ఎస్ నిర్వ హించత లపెట్టిన రైతు మహాధర్నాకు బుధవా రం హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు ధర్నా నిర్వహిం చుకోవాలని, ధర్నాలో 1,500 మంది వరకు మాత్రమే పాల్గొనాలని, నేర చరిత్ర ఉన్నవారు పాల్గొనరాదని, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది.

శాంతి భద్రత లకు సమస్య ఎదురైన పక్షంలో పోలీసులు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది. ఈనెల 21న నల్లగొండలో ధర్నాకు పోలీసులు అనుమతించకపో వడాన్ని సవాలు చేస్తూ నల్లగొండ బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. దీనిపై జస్టిస్ బీ విజయసెన్ రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫున ఎం. రూ పేందర్ వాదనలు వినిపిస్తూ, అనుమతులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఈనెల 20న లంచ్‌మోషన్ దాఖలు చేశామన్నారు. గ్రామసభలు, రిపబ్లిక్ డే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున భద్రతా సమస్యలు ఉత్పన్నం అవుతాయనే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృ ష్టికి తీసుకవచ్చారు.

గతంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత అనుమతి నిరాకరించారని, అందువల్ల ఈనెల 27న ధర్నాకు అను మతించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో 27న కాకుం డా 28న రైతు మహా ధర్నాకు అనుమతించాలని న్యాయమూర్తి ఆదేశించారు.