ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రైతు బజార్(Adilabad Rythu Bazar) ఎదుట రైతులు నిరసన(Farmers Protest)కు దిగారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్ లో ప్రైవేటు వ్యాపారస్తుల అమ్మకాలను నిరసిస్తూ ఆదివారం రైతు బజార్ ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. వ్యాపారులకు రైతు బజార్(Rythu Bazar)లో కూరగాయలు అమ్మకలకు అవకాశం ఇవ్వడంతో తాము రోడ్డు పైన విక్రయాలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోయారు. రాస్తారోకో తో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వన్ టౌన్ సీఐ సునీల్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపచేశారు. అనంతరం రోడ్డు పక్కన దుకాణాలను తొలగించారు. ఎవరైనా రైతు బజార్ లోపలనే విక్రయాల జరుపుకోవాలని, రహదారిపై దుకాణాలు పెడితే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో రోడ్లపై విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు.