calender_icon.png 23 February, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీరు ఇవ్వాలని రైతుల నిరసన

18-02-2025 12:58:56 AM

వనపర్తి, ఫిబ్రవరి 17 ( విజయక్రాంతి ) : మేజర్ 4 కాలువ నుండి పిల్లకాల్వను తవ్వి సాగునీరు అందించాలని కోరుతూ సోమవారం పానగల్ మండలం అన్నారం ప్రధాన రహదారిపై రైతుల మూడు గంటలపాటు రాస్తారోకోలు నిర్వహించారు.

దీంతో అక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. సమంత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూర్చోవడంతో వనపర్తి సీఐ కృష్ణ పాన్ గల్ ఎస్ ఐ శ్రీనివాసులు చిన్న నేటిపారుదల శాఖ డిఈ వెంకటరమణాదేవి గ్రామానికి చేరుకుని వారం పది రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో కార్యక్రమం విరమించుకున్నారు.