22-04-2025 11:37:18 AM
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట,(విజయక్రాంతి): వడ్లు కాంటాలు కావడం లేదని రోడ్డుపై పోసి రైతులు వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపిన ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండాలో చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చి 20 రోజులుగా వడ్లు కాంటా కావడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో ఇవాళ ధాన్యం కాంటాలు వేయకపోవడంతో గుర్రం తండలో రైతులు సూర్యాపేట దంతాలపల్లి జాతీయ రహదారిపై పెద్దఎత్తున ధర్నా నిర్వహించి వడ్లను రోడ్డుపై పోసి నిప్పంటించారు. రహదారిని దిగ్బంధం చేసి కంప చెట్లను రోడ్డుపై వేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 20 రోజుల నుండి ఐకెపిలో ఎలాంటి కాంటాలు జరగక లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లని తగలబెట్టినట్లు రైతులు తెలుపుతున్నారు. ధాన్యం కోనుగోలు జరిగేంత వరకు ధర్నా విరమించమని రైతులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.