calender_icon.png 28 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సర్కారుపై రైతుల కన్నెర్ర

30-08-2024 01:26:26 AM

  1. రుణమాఫీ, రైతు భరోసా కోసం రాస్తారోకో 
  2. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు

జగిత్యాల/కామారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని జగిత్యాల జిల్లా రైతన్నలు కన్నెర్ర జేశారు. రుణమాఫీ, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ గురువారం జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దేవుడిపై ప్రమాణాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతులకు పంగనామాలు పెట్టాడని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమం లో పార్టీలకు అతీతంగా అన్నదాతలు కదం తొక్కారు. రైతులను ప్రభుతం పట్టించుకోకపోతే రాష్ర్టం మొత్తం స్తంభించేలాగా ఉద్య మాలు కొనసాగుతాయని హెచ్చరించారు.

అనంతరం మేడిపల్లి తహసీల్దార్  వసంతకు, వ్యవసాయశాఖ అధికారి సాహిద్ అలీకి రైతులు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, మేడిపల్లి, కో రుట్ల, కథలాపూర్ ఎస్సైలు శ్యామ్ రాజ్, శ్రీకాంత్, శేత, నవీన్, పోలీసు సిబ్బంది అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిరహించారు. మెట్‌పల్లిలోనూ మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లా పూర్ మండలాల రైతులు ధర్నా, రాస్తారోకో నిరహించారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో రైతు వేదిక ఎదుట రైతులు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వ్యవసాయాధికారి పవన్ కుమార్ ఘటన స్థలానికి వచ్చి వినతి పత్రం స్వీకరించారు.