07-03-2025 12:32:50 AM
తుంగతుర్తి, మార్చి 6: ఎస్సారెస్పీ జలాలు చివరి భూముల వరకు అందించాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు ఏకంగా ఎస్సారెస్పీ కాలువలో కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం మాకు పూర్తిస్థాయిలో ఎస్సారెస్పీ జలాలు వచ్చాయని దీంతోనే ఐదు ఎకరాలు నాటుపెట్టామని ప్రస్తుతం రెండు ఎకరాల పైగా నీళ్లు అందక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తుంగతుర్తి అన్నారం ఎస్సారెస్పీ కాల్వకు గోదావరి జిల్లాలు పూర్తిస్థాయిలో నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు.