calender_icon.png 22 April, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం

22-04-2025 12:40:33 AM

ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి , ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): భూభారతి చట్టం తో ఎంతోకాలంగా ఇబ్బందులు పడుతున్న సమస్యలకు చక్కని  పరిష్కార మార్గం లభించిందని  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం బొమ్మల రామారం, రాజ పేట మండలాలలో పర్యటించి ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సు లలో పాల్గొన్నారు.

బొమ్మల రామారం మండల కేంద్రంలోని రెవెన్యూశాఖ అధ్యర్యంలో   రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం   అవగా హన సదస్సులో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.... భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు  కల్పించాలని గొప్పఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు.  ఈ చట్టం  గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి డిసెంబర్ మాసంలో రెవెన్యూ రికార్డుల లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. సెక్షన్ 12 ప్రకారంగా పహాని పొందవచ్చని, సెక్షన్ 4 ప్రకారం తప్పులు సరిదిద్దడం జరుగుతుందన్నారు.

నిజమైన నిరుపేదల అన్ని రకాల భూ సమస్యలకు భూ భారతి చట్టం శాశ్వత పరిష్కారం చూపుతుం దన్నారు. ఈ అవగాహన సదస్సులో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, బొమ్మల రామారం, రాజాపేట తహసిల్దార్లు శ్రీనివాసరావు,అనిత, ఎంపీడీఓలు త్రివిక్రమ్, నాగ వాణి , ప్రత్యేక అధికారులు జ్యోతి కుమారి, శాంత కుమారి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు  పాల్గొన్నారు.