calender_icon.png 12 January, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలే బీఆర్‌ఎస్ అస్త్రాలు

08-12-2024 01:38:24 AM

  1. సర్కారు వైఫల్యాలపై సభలో దూకుడే 
  2. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలు
  3. నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): రైతు సమస్యలనే ప్రధాన అస్త్రంగా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ యుద్ధానికి సిద్ధమవు తున్నది. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సర్కారు వైఫల్యాలపైనే దూకుడుగా వ్యవహరించేందుకు వ్యూ హ రచన చేస్తుంది.

రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టే విధంగా సభలో సభ్యులు వ్య వహరించాలని నిర్ణయించింది. ఎర్రవెల్లి పా మ్‌హౌస్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తో సమావేశం కానున్నారు. ఏడాది కాలం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలపై చర్చించనున్నట్టు సమాచారం.

సర్కారు వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడు తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అసెంబ్లీనే సరైన వేదికగా భావిస్తోంది. ఇదే అవ కాశంగా భావించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాలను నెల రో జుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్ణాల కు జరిగిన అన్యాయాలపై నిలదీసేందుకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. లగచర్ల భూసేకరణ నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల, ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలులో వైఫల్యాలు, వ్యవసాయ, సంక్షేమ రంగాలు వంటి ప్రతి అంశాన్ని సభలో లేవనెత్తుతామని ప్రకటించారు. 

రైతు భరోసా, రుణమాఫీపై ఫోకస్ 

ఇటీవల ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్, కేటీఆర్ సమావేశమై రాష్ట్ర రాజకీయాలు, సీఎం రేవంత్ విధానాలపై చర్చించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నియామకాలు, విద్యుత్ సమస్య, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500 వంటి అంశాలపై వాస్తవ పరిస్థితిపై నివేదికలు తెలప్పించుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు, హరీశ్‌రావు ఇతర నేతల అరెస్టుపై కూడా సభలో అవలంబించాల్సిన తీరుపై చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, శాంతి భద్రతలపై నిలదీయాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. జనవరిలో పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో ఈ సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు తమకు కలిసివస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  

లగచర్ల గిరిజనుల సమస్యలపై గళం 

అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల గిరిజన రైతుల అంశం బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చేలా కనిపిస్తుంది. గిరిజన బిడ్డల భూములు బలవంతంగా లాక్కోవడం, ప్రజలపై కేసులు నమోదుచేయడంపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మానవ హక్కులు కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి గిరిజనుల సమస్యలు వివరించామని, వారికి ప్రభుత్వం హాని తలపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించబోతున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సర్పంచులకు రావాల్సిన బిల్లులపైనా నిలదీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు, అవసరమైతే వారితో అసెంబ్లీ ముట్టడి చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్టు తెలిసింది.