calender_icon.png 29 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న రైతు పాలసీ

29-11-2024 01:17:38 AM

  1. ఇదే రోజు 3 లక్షల మందికి రుణమాఫీ: మంత్రి తుమ్మల 
  2. పాలమూరు --- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం: మంత్రి రాజనర్సింహ
  3. బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం: మంత్రి జూపల్లి
  4. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండుగ’ షురూ

మహబూబ్‌నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రైతు పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘రైతు పండుగ’లో ఈ పాలసీని ప్రకటిస్తారని స్పష్టంచేశారు.

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన మహబూబ్‌నగర్ జిల్లా భూ త్పూర్ మండలం అమిస్తాపూర్‌లో ఆయన మూడు రోజుల  ‘రైతు పండుగ’ను అట్టహాసంగా ప్రారంభించారు.

రైతులకు సంబం ధించిన ఏమైనా హామీలు నెరవేర్చకపోతే, రైతాంగానికి పాదాభిందనం చేస్తామని, ఎంతకష్టమైనా వారికి ఇచ్చిన హామలు అమలు చేస్తామన్నారు. 30న సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన 3 లక్షల రుణాలు సైతం మాఫీ అవుతాయన్నారు. తమ ప్రభుత్వం ఏడాది పూర్తి కాకుండానే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిందన్నారు.

సీఎం సూచన మేరకే పాలమూరులో రైతు పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. పాలమూరు నుంచి బూర్గుల రామకృష్ణారావు తర్వాత సీఎం అయిన మరో నేత రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. ‘మా ప్రభు త్వం తప్పు చేయదు.. తలవంచదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుంది.

బీఆర్‌ఎస్ నేతలు మా ప్రభుత్వంపై లేనిపోని ఆరో పణలు చేస్తున్నారు. వారి మాటలను ప్రజలు నమ్మొద్దు. వాస్తవాలను చూసి బేరీ జు వేయండి’ అని విజ్ఞప్తి చేశారు. వచ్చే నా లుగేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు ఆయిల్‌పాం సాగుపై దృ ష్టి సారించాలని పిలుపునిచ్చారు. తనపై న మ్మకం ఉంచి ఆయిల్ పాం సాగు చేయాలని అన్నారు.

సాగులో లాభం రాకుంటే తాను ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి రైతుకు మేలు చేసే విధంగా ఎన్నో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్ర ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వ్య వసాయ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ వంశీ కృష్ణ, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీ పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అప్పులను కుప్ప చేసింది: మంత్రి జూపల్లి

ధనిక రాష్ట్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఆ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిన అప్పులకు తమ ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తున్నదని స్పష్టం చేశారు. సర్కార్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుపండుగ వేడుకలను సద్వినియోగం చేసుకుని రైతులు సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. 

ప్రజలకు మంచి చేస్తాం: మంత్రి రాజనర్సింహ

 దేశంలో ఎప్పుడూ తాను ఇలాంటి రైతుపండగ చూడలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. వచ్చే నాలుగేళ్లలో తమ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం శ్రమిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కాలం వెల్లదీసే ప్రభుత్వం కాదని, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.