calender_icon.png 2 January, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్ రెడ్డి కుంటను కాపాడాలని రైతులు రెవెన్యూ అధికారికి వినతి పత్రం

30-12-2024 06:41:51 PM

వెల్దుర్తి (విజయక్రాంతి): ఎద్దులపల్లి గ్రామంలో గల రామ్ రెడ్డి కుంట సర్వే నంబర్ 95 లో గల పది ఎకరాల రామ్ రెడ్డి కుంట ఆక్రమణకు గురైందని సోమవారం ఎద్దులపల్లి రైతులు, సిపిఎం మండల నాయకులు గౌరీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రామ్ రెడ్డి కుంట చుట్టుపక్కల అక్రమార్కులు కొందరు ఆక్రమించుకుంటున్నారు, ఇరుపక్కల కలుపుకొని కుంటను ఆక్రమించుకున్నారని ఇలాగే ఉంటే కుంట కనుమరుగయి ప్రమాదం పొంచి ఉందని సిపిఎం మండల నాయకులు గౌరీ, రైతులు వాపోయారు. మండల రెవెన్యూ అధికారి తక్షణమే స్పందించి రామ్ రెడ్డి కుంటను పూర్తిగా సర్వే చేసి ఎంత విస్తీరంలో ఉందో అంతటి హద్దులు వేయవలసిందిగా కోరుతున్నామని గ్రామ రైతులు మండల రెవెన్యూ అధికారి కృష్ణను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు గౌరీ, డి.నరేందర్, బి.కుమార్, ఎస్ శ్రీనివాస్, బి.రాములు, పాల్గొన్నారు.