19-04-2025 11:02:46 PM
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి..
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డికి వినతి పత్రం అందజేత..
యాచారం: ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించాలని శనివారం సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఏసిపి కార్యాలయంలో డిసిపి సునీత రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ... ఫార్మాసిటీ పేరుతో 10,200 ఎకరాల అసైన్మెంట్ భూములు, 9133 ఎకరాల పట్టా భూములు కలిపి మొత్తం 19,333 ఎకరాల భూమిని యాచారం, కందుకూర్ మండలాలో ప్రభుత్వం భూమిని సేకరించింది.
వివిధ గ్రామాల్లో అసైన్మెంట్ భూములు సాగుకు యోగ్యమైన భూములకు పరిహారం చెల్లించి 591 ఎకరాలు ఉన్నటువంటి భూమిని 99 మంది భినామి పేర్లతో 30 కోట్ల రూపాయాలు రెవున్యూ అధికారులు, దళారీలు కలిసి కాజేశారు. అసలైన వాస్తవ పట్టా దారులకు పరిహారం ఇవ్వకుండా బోగస్ పేర్లతో ప్రజాధానాన్ని కాజేసిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టి అసలైన అసైన్మెంట్ పట్టా దారులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అన్నారు.
నిషేధిత జాభితానుండి రైతుల పేర్లను తొలగించాలన్నారు
భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 121 చదరపు గజాల ఇంటి స్థలం సర్టిఫికెట్ ఇచ్చారు కానీ రైతులకు తక్కువ నష్టపరిహారం ఇవ్వడం వల్ల 500 చదరపు గజాలకు పెంచి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 15 లక్షలు ఇవ్వాలని అన్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే పనులు ఆపించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో. సిపిఎం పార్టీ యాచారం మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, కందుకూరు మండలం ప్రధాన కార్యదర్శి, బుట్టి బాలరాజు, సిపిఎం పార్టీ నాయకులు. గడ్డం రాములు, గడ్డం యాదగిరి, సంజీవ , గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.