calender_icon.png 5 April, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

05-04-2025 01:55:42 AM

కలెక్టర్ ఎం హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 4 ( విజయ క్రాంతి ): జిల్లాలో కురిసిన అకాల వర్షం,  ఈదురు గాలులు, వడగళ్ల వానతో,  నష్టపోయిన ఏ ఒక్క  రైతు  కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

శుక్రవారం తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి మరియు దయ్యం బండ తండాలో నిన్న కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు , వడగళ్ల వానకు వరి చేనులు , మామిడి తోటలు కాయగూరల పంటలు, మిర్చి వంటి కొన్ని రకాల పంటలు వేసినందున్న  చేతికి వచ్చిన పంటలు  రైతులు నష్టపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ఎకరాల పంటలు నష్టపోవడం జరిగిందని   కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన  పంట పొలాలు, తోటలను రైతులతో కలిసి  పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన  వరి పంటలు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఎకరాలు నష్టపోయారని దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాలలో  , క్షేత్రస్థాయిలో పంటలను, తోటలను పరిశీలిస్తున్నారని అన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన  అనంతరం నష్ట పోయిన ప్రతి రైతు యొక్క వివరాలు నమోదు చేసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు.  తహసిల్దార్ దేశ్య నాయక్ , హార్టికల్చర్ అధికారి సుభాషిణి,యం పి డి ఓ, సంబందిత అధికారులు పాల్గొన్నారు.