09-04-2025 01:06:35 AM
ఫార్మాసిటీ రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
మక్కపల్లి స్వరూప, నక్కర్త మేడిపల్లి కోఆఫరేటివ్ డైరెక్టర్
యాచారం ఏప్రిల్ 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మా సిటీ భూసేకరణ కార్యక్రమం లో భూ బాధిత రైతులకు బారి నష్టం వాటిల్లిందని భూములు ఇవ్వకుండానే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, రైతులను భయబ్రాంతులకు గురిచేసే పోలిసుల పహారాలో కంచే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 2013భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం నాలుగు వంతులు ఇవ్వాలని, భూముల పై ఆధారపడిన వృత్తి కూలాలకు నష్టపరిహారం చెల్లించాలని.డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన వారికి 121గజాల ఇంటి స్థలం వేంటనే పంపిణీ చేయాలని, భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2200ఏకరాల భూములలో ఏలాంటి పనులు చేయవద్దని హైకోర్టు వారి ఆర్డర్ వున్న దానిని ధిక్కరించి ఆధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.పేర్కొన్నారు. పట్టా హక్కులు కలిగివున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని.ఉపయోగపడే పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములలోఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మా కంపెనీలు స్థాపించడానికి కాకుండా నిరుద్యోగులకు యువతకు ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు.