calender_icon.png 17 March, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి

17-03-2025 02:11:09 AM

ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ రావు

ఆదిలాబాద్, మార్చ్ 16 (విజయ క్రాంతి) :  సమస్యల పరిష్కారానికై రైతులు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి అని AIKS రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంత్ రావు పిలుపునిచ్చారు. 

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (AIKS) ఆదిలాబాద్ జిల్లా 7వ మహాసభలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా రైతు సంఘం సీనియర్ నాయకుడు బత్తుల గంగారెడ్డి జండా ఆవిష్కరించారు. జాతీయ కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ అతుల్ అంజాని చిత్ర పటానికి నివాళ్ళు అర్పించారు. 

ఈ సందర్భంగా హేమంత్ రావు మాట్లాడుతూ AIKS రైతుల కోసం అనేక పోరాటాలు చేసి లక్షల ఎకరాల బంజరు భూములను రైతులకు పంపిణీ చేసిన ఘనత మన సంఘానికి దక్కిందని అన్నారు. ముఖ్యంగా పత్తికి క్వింటాల్ కి రూ.15,000, సోయకు రూ. 10,000, కందులకు రూ. 10,000, శనగలు రూ.10,000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతుల కోసం AIKS నిరంతరం కృషి చేస్తుంద న్నారు. నాయకులు చిలుకా దేవిదాస్, ప్రభాకర్ రెడ్డి, విలాస్, సిర్ర దేవేందర్, లోకరి పోశెట్టి, రాథోడ్ శుభాష్, SN రెడ్డి,  ప్రభాకర్, మెస్రం భాస్కర్, గేడం కేశవ్ ఉన్నారు