24 May, 2026 | 8:30 PM

ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతుల రాస్తారోకో

24-05-2026 07:27 PM

కామారెడ్డి జిల్లా అన్నారం రైతుల ఆందోళన

కొనుగోలు కేంద్రాల వద్ద పడి గాపులు పడుతున్నామని రైతుల ఆవేదన

కామారెడ్డి తూంపల్లి రోడ్డుపై రైతుల ఆందోళన

కామారెడ్డి,(విజయక్రాంతి): వారి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదని రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని రైతులు అధికారులను  ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రతిరోజు కోరుతున్న రేపు మాపూ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

తప్ప ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై పెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు చేపట్టిన ఆందోళన విషయాన్ని తెలుసుకున్న అధికారులు రైతుల వద్దకు వచ్చి సముదాయించారు. కాంటా పెట్టి ధాన్యాన్ని తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కామారెడ్డి తూముపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

పోలీసులు, రెవిన్యూ అధికారులు రైతులతో మాట్లాడి ధర్నా విరమింప జేశారు. కామారెడ్డి మండలంలోని టేక్ రియల్, అడ్లూరు, ఇస్రోజివాడి, గర్గుల్, ఇలిచిపూర్ గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని కాంట పెట్టాలని అధికారులను వేడుకున్నారు. ధాన్యం కాంట పెట్టడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేపట్టి రైస్ మిల్లుకు తరలించాలని రైతులు కోరారు. అధికారులు వచ్చి రైతులను సముదాయించారు.