నారాయణపేట,(విజయక్రాంతి): అభిరామి రైతు ఉత్పత్తిదారుల సంఘం వాటాదారులకు షేర్ సర్టిఫికెట్స్ పంపిణీ కోటకొండ గ్రామంలో అభిరామి రైతు ఉత్పత్తి దారుణం సంఘం కోటకొండ వారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతుల సమావేశం అభిరామి రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ బి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసి సంఘ సభ్యులకు షేర్ సర్టిఫికెట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి మాజీ ఎంపీటీసీ కేంచే శ్రీనివాసులు, మాట్లాడుతూ...సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10000 రైతు సంఘాల ఏర్పాటులో భాగంగా నాబార్డ్ వారి సహాయంతో కోటకొండ, తిరుమలాపూర్, అభంగాపూర్, బండగొండ గ్రామాల పరిధిలో అభిరామి రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని 20 ఏప్రిల్ 2023 రోజున సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు ఏర్పాటు చేసింది.
సెంట్రల్ సెక్టర్ స్కీం ఉద్దేశం రైతులు 1500 మంది ఇందులో చేరి తమ వాటా దనం వెయ్యి రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరితే నాబార్డ్ నుండి సమానంగా ఒక్కొక్క సభ్యునికి ₹1000 చొప్పున 15 లక్షల రూపాయలను సంఘం ఖాతాలో జమ చేస్తుంది ఈ మొత్తం రూపాయలతో సంఘం రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు తదితర అవసరాలు తక్కువ ధరలకు అందించాలి. రైతులు ఉత్పత్తి చేసిన దాన్యంకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నించాలి. ప్రస్తుతం ఈ సంఘంలో 720 మంది సభ్యులు వాటాదారులుగా చేరడంతో 403 మంది రైతులకు ఈక్విటీ గ్రాంటు నాబార్డ్ నుండి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు సంఘం ఖాతాలో జమ కావడం జరిగింది.
ఇట్టి రూపాయలకు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సమిష్టిగా తెచ్చుకొని తక్కువ ధరలకు వాటాదారులకు అందించడం జరిగిందన్నారు. అలాగే రైతులు ఉమ్మడిగా వ్యాపారం చేసుకోవడం వలన అనేక రకాల ఉపయోగాలు పొందవచ్చునని, నాబార్డ్ నుండి వచ్చే రూ.15 లక్షల ఈక్విటీ గ్రాంటును పొందుటకు ఇంకా 780 మంది రైతులను త్వరగా సంఘంలో చేర్పించుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు అగ్రి ఎక్స్పర్ట్ శివకృష్ణ, మార్కెటింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభిరామి రైతు ఉత్పత్తి దారుల సంఘంలో చేరితే రైతులకు కలిగి ఉపయోగల గురించి వివరించడం జరిగింది.
అనంతరం చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో సభ్యులకు షేర్ సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిరామి రైతు సంఘం డైరెక్టర్లు వేపూరి నర్సిరెడ్డి గారు, నరసింహులు సీఈవో వెంకటయ్య, అకౌంటెంట్ అశోక్, మహిళా సంఘం అధ్యక్షురాలు హనుమమ్మ, గ్రామ పెద్దలు ఎడ్ల రాజు, ప్రభంజన్ రావు, హాజీ మల్లన్, కొంగరి రాములు, ప్రవీణ్, రైతులు కోలుకుంది కాశన్న, జి లక్ష్మప్ప, వెంకటయ్య, బాలప్ప మరియు రైతులు పాల్గొనడం జరిగింది.