calender_icon.png 6 November, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి ఢిల్లీకి రైతుల మార్చ్

25-07-2024 01:38:58 AM

రాహుల్ గాంధీతో వ్యవసాయ కార్మిక సంఘాల నేతల భేటీ

న్యూ ఢిల్లీ, జూలై 24: మరిన్ని పంటలకు కనీస మద్దతు (ఎంఎస్పీ) కల్పించటంతోపా టు దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు.. మరోసారి ఢిల్లీని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నాయి. రైతు సంఘాల నేతలు బుధవారం పార్లమెంట్ ప్రా ంగణంలోలోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రా హుల్ గాంధీని కలిసి తమ సమస్యలు వివరించారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత అంశాన్ని లోక్ సభలో లేవనెత్తాలని 12 రైతుసంఘాల నేతలు రాహుల్‌ను కోరారు.

ప్రభుత్వం స్పందించకు ంటే మరోసారి పోరుబాటు పట్టేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. కాగా రాహు ల్‌గాంధీని కలిసేందుకు రైతు నేతలు పార్లమెంట్‌లోపలికి వెళ్లేందుకు యత్నంచగా అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకోవటంతో ఎంపీలు కలుగజేసుకొని లోపలికి తీసుకెళ్లారు. ‘రైతులను మేము పార్లమెంట్‌లోకి ఆహ్వానించాము. కానీ వారిని అధికారులు అనుమతించలేదు. బహుశా వారు రైతులైనందుకే అడ్డుకున్నారేమో’ అని రాహుల్ అధికారపక్షానికి చురకలంటిచారు.