29-03-2025 07:24:25 PM
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వలన ఇబ్బదులు పడుతున్న రైతులు..
సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా..
కలెక్టర్ క్రాంతి వల్లూరుకు వినతిపత్రం అందజేత..
సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు..
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రుణమాఫీ వెంటనే చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుకు వినతిపత్రం అందజేశారు. రైతు రూ.2 లక్షలలోపు రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వంను కోరారు. పెట్టుబడి దారులకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్న బ్యాంక్ లు రైతులకు ఎందుకు మాఫీ చేయరని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలో మంజీరా గ్రామీణ బ్యాంక్ పరిధిలో సుమారు 1000 పైగా రైతులు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అన్నారు. కానీ ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని తెలిపారు. కలెక్టర్ తక్షణమే చర్య తీసుకొని రైతులకు రుణమాఫీ ఇప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని అన్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ గౌడ్, రామచంద్రయ్య, నాగరాజు, దినేష్ గౌడ్, పోశయ్య, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, విఠల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.