calender_icon.png 27 October, 2024 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతాంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి

22-07-2024 01:31:06 AM

ఎంపీ మల్లు రవిని కలిసిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై చర్చించాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఎంపీ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఆదివారం ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమ ర్పించారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని సాగిన రైతుల సుదీర్ఘ పోరాటం సందర్భంగా డిసెంబర్ 2021లో ప్రధాన మంత్రి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయనకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 63 సీట్లలో పాలక పార్టీ అభ్యర్థులను ఓడించటంలో రైతు కార్మిక కష్టజీవుల ప్రయత్నం విజయవంతమైందన్నారు. జూలై 23 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై తప్పకుండా చర్చిస్తామని  ఈ సందర్భంగా మల్లు రవికి వారికి హమీ ఇచ్చినట్లు తెలిపారు.