- వచ్చే నెల 7న నల్లగొండకు సీఎం రేవంత్‌రెడ్డి
- పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): రైతులందరి ఖాతాల్లో త్వరలో రైతుభరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో గురు వారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 7న బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు, మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారం భించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును నీటితో నింపడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభంతో తన 18 ఏండ్ల చిరకాల వాంఛ నెరవేరబోతుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీని సైతం పూర్తిస్థాయిలో చెల్లిస్తామ న్నారు. నల్లగొండ పట్టణాన్ని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.110 కోట్లతో ఇప్పటికే అండర్‌గ్రౌండ్ నిర్మాణం, ఇతర పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.275 కోట్లతో మెడికల్ కళాశాల భవనాలను నిర్మించా మన్నారు.
వీటితోపాటు రూ.100 కోట్లతో లతీఫ్ షా దర్గా, బ్రహ్మంగారిగుట్ట ఘాట్ రోడ్ల నిర్మాణం పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.30 వేల కోట్లతో చేపట్టబోయే రీజినల్ రింగ్ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ (ఎన్‌హెచ్ 65) విస్తరణపై త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించి తుది నిర్ణయం ప్రకటి స్తామ న్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.