ఖమ్మం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో రుణమాఫీ 60 శాతం, ధాన్యం బోనస్ 70 శాతం, రైతు భరోసా 96 శాతం పెండింగ్‌లో ఉందన్నారు. చిన్న చిన్న గామాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసి మిగతా గ్రామాలను విస్మరించారన్నారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణాకు న్యా చేయాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు తాతా భాస్కర్‌రావు, బండి రమేశ్, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్‌కె మీరా, దుగ్గి కృష్ణ, గోడవర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.