calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఆదాయం రెట్టింపు

17-04-2025 12:00:00 AM

ఎఫ్‌పీఓలుగా 311 పీఏసీఎస్‌లు

ఎఫ్‌పీఓ అంటే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ

సాంకేతిక పరిజ్ఞానంతో.. మూడేండ్ల పాటు నిర్వహణకు రూ. 18 లక్షల సాయం... 

ప్రధానమంత్రి కిసాన్ ఎఫ్‌పీఓ యోజనతో అన్నదాతలకు మరింత ప్రయోజనం

మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పండించి న పంటలను ప్రకృతి, వాతావరణ నష్టాల నుంచి కాపాడుకునేందుకు, మార్కెట్‌కు తరలించేందుకు సరైన సదుపాయాలు లేక పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందు కు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ ‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్’ (ఎఫ్పీఓ) స్కీంను ప్రవేశపెట్టింది. ఎఫ్పీవో అంటే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ. ఇది రైతులు ఏర్పా టు చేసుకునే సంస్థ.

రైతుల ఆదాయం రెట్టిం పు చేసుకోవడం, వారు పండించిన పంటకు మద్దకు పొందేందుకు ప్రవేశపెట్టిన పథకా ల్లో ఈ ఎఫ్పీవో ఒకటి. ఈ పథకంలో చేరితే రైతుల వ్యవసాయ బిజినెస్ ప్రారంభించేందుకు కేంద్రం రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఎఫ్‌పీఓలను ప్రోత్సహించే ఏజెన్సీలలో నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్ మెంటు కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ఒకటి కాగా స్మాలర్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఎసీ), నాబార్డు, డీఏసీ, ఎఫ్ డబ్ల్యూ ఆమోదించిన ఇతర ఏజెన్సీలు.

11 మంది రైతులు ఆర్గనైజేషన్‌గా.. 

2023- ఆర్థిక సంవత్సరం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)లు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీఓ)లుగా ఎంపికయ్యాయి. వీటి పరిధి లో 10 వేల ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐదేండ్ల పాటు వీటికి సా యం అందించనుంది. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడి కంపెనీ (ప్రస్తుతం సహకార) చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవా లి. ప్రతి రైతు సభ్యునికి రూ.2వేల వరకు ఈక్విటీ గ్రాంట్‌ను మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో గరిష్టంగా (750 సభ్యులకు) ఒక్కో ఎఫ్పీవోకు రూ.15 లక్షల వరకు రుణం అందజేయనుంది. దీనికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ మద్దతు ఉంటుంది. 

మూడేండ్ల పాటు నిర్వహణకు రూ. 18 లక్షల సాయం

ఎఫ్‌పీఓ స్థాపించిన మూడు సంవత్సరా ల వరకు నిర్వహణ ఖర్చు కోసం ప్రధాన మంత్రి కిసాన్ ఎఫ్‌పీఓ యోజన పథకం కింద రూ. 18 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఎఫ్‌పీఓ మేనేజర్‌కు నెలకు రూ.25 వేలు, అకౌంటెంట్‌కు రూ.10 వేలు, కార్యాలయానికి అద్దె రూపంలో ఏడాదికి రూ. 48 వేలు, విద్యుత్, మోబైల్ యుటిలిటీ చార్జీలు 12 వేలు, ఫర్నీచర్‌కు రూ.లక్ష వరకు, సమావేశాలకు రూ.18 వేలు, స్టేషనరీ ఇతర ఖర్చుల కింద రూ. 12 వేలు ఇలా మూడేండ్ల పాటు ఈ పథకం కింద ఇవ్వనున్నారు.

ఎంపికైన పీఏసీఎస్‌లు ఇవే...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43 పీఏసీఎస్‌లు ఎఫ్‌పీఓలుగా ఎంపికయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 12 (చెన్నూర్, జైపూర్, నెల్కి వెంకటాపూర్(దండేపల్లి), తాండూరు, చంద్రవెల్లి (బెల్లంపల్లి), ధర్మరావుపేట (కాసిపేట), కోటపల్లి, జెండా వెంకటాపూర్ (లక్షెట్టిపేట), మండమర్రి, మంచిర్యాల(నస్పూర్), వేమనపల్లి, పడ్తనపల్లి (హాజీపూర్) పీఏసీఎస్‌లు ఎంపికయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 (కొత్తపేట (కాగజ్ నగర్), భూర్నూర్(లింగాపూర్), రెబ్బన, సిర్పూర్ -టీ, బెజ్జూర్, కెరమెరి, గురుడ్పేట (కౌటాల), తిర్యాణి పీఏసీఎస్‌లు, ఆదిలాబాద్ జిల్లాలో 15 (గుడిహత్నూర్, ఇంద్ర వెల్లి, ఆదిలాబాద్(మావల), లాండసాంగ్వీ (ఆదిలాబాద్ అర్బన్), బజార్ హత్నూర్, తాంసి (భీంపూర్), బోథ్, నేరడిగొండ, తలమడుగు, జమిడి-ఏ(తాంసి), జైనాథ్, బేల, నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ) పీఏసీఎస్‌లు, నిర్మల్ జిల్లాలో 8 (పాండవపూర్ (దస్తురాబాద్), ఖానాపూర్, కుంటాల, కౌంట్ల-బీ (సారంగాపూర్), బన్సపల్లి (నర్సాపూర్-జీ), ముక్తాపూర్ (నిర్మల్ రూరల్), మంజులాపూర్ (సోన్), మామడ) పీఏసీఎస్‌లు ఎఫ్ పీ ఓలుగా ఎంపికయ్యాయి.

రైతులకు మెరుగైన సేవలు

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు వీలుగా భారత ప్రభుత్వం 2020, జూలైలోనే 10 వేల ఎఫ్పీవోల ఏర్పాటు, ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ ఎఫ్పీవో ద్వారా అగ్రి ఇన్‌పుట్‌లు అయిన విత్తనాలు, మందులు, ఎరువు లు, ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, మార్కె ట్ అనుసంధానాలు, క్రెడిట్ లింకేజీలు, సాంకేతిక పరిజ్ఞానం వాడటం, ఇతర ఎక్వి ప్ మెంట్లు ఇలా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలతో రైతులకు విక్రయించే అవకాశం కల్పించింది. అంతే కాకుండా అధిక ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలైన విత్తనోత్పత్తి, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం లాంటివి నిర్వహించవ చ్చు. ఎఫ్పీవోల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. దీనిపై పీఏసీఎస్‌ల సీఈవోలకు, అకౌంటెంట్లకు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం.

-  మోహన్, జిల్లా సహకార అధికారి,మంచిర్యాల