calender_icon.png 23 January, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగమేశ్వర, బసవేశ్వరపైనే రైతు ఆశ!

13-07-2024 01:27:09 AM

  • ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వంలో నిధులు
  • కాళేశ్వరం నుంచి మంజీరాకు అనుసంధానం 
  • కొత్త సర్కారులో నిలిచిన పనులు

సంగారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి నియోజక వర్గంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. అందుకు 6,727 ఎరాల భూసేకరణ చేసి, 231 గ్రామాలకు సాగునీరు అందిచేందుకు పనులను ప్రారంభిం చారు. సంగమేశ్వరకు రూ. 2,653 కోట్లు, బసవేశ్వరకు రూ. 1,774 కోట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల  చేసింది. వాటినుంచి 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు  పనులు కూడా ప్రారంభించిది.

జహీరాబాద్ నియోజకవర్గంలో 1.06లక్షల ఎకరాలకు, బసవేశ్వర పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.18 లక్షల ఎకరాలు, సంగారెడ్డి నియెజకవర్గంలో 50.190 ఎకరాలు, ఆందోల్ నియోకవర్గంలో 58.907  ఎకరాలకు సాగునీరు అం దించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. కాళేశ్వరం లింక్  కాలువ ద్వారా 12 టీఎంసీల నీటిని సిం గూర్ ప్రాజెక్టులో ఎత్తిపోసేలా ప్రణాళికను రచించారు. మల్లన్న సాగర్ నుంచి 12 టీఎంసీల గోదావరి జలాలను మంజీరాలో నదిలో నింపి ఎత్తిపోసేందుకు సర్వే చేశారు. 

నిలిచిపోయిన ఎత్తిపోతల పథకం పనులు

మునిపల్లి మండలంలోని మంజీరా నదిపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేసి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన కొన్ని రోజులకే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నిలిచిపోయిన పనులను పూర్తి చేసే చర్యలు చేపట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మం జీరా నదిపై ఏర్పాటు చేసే రెండు ఎత్తిపోతల పథకాల పనులను పెండింగ్‌లో పెట్టిందనే ప్రచారం సాగుతున్నది. పనులను పూర్తి చేసి, వ్యవసాయానికి సాగునీరు అందించేందు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.