- సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ
- యాత్ర సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్
హైదరాబాద్, నవంబర్ 8 ( విజయక్రాంతి) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర విజయవంతమైంది. ఈ యాత్ర ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చెక్ పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రక్షాళన చేసి ఇబ్బందులు తొలగిస్తామని మూసీ బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు.
దీంతో మూసీ బాధితులతోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా నూతన ఉత్తేజం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైై మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఆ తర్వాత భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరు కున్నారు. మూసీ నది మధ్యలో ఉన్న భీమలింగం స్వామివారి ఆలయాన్ని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడే లైఫ్ సేవింగ్ బోటులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నదిలో కొంత దూరం ప్రయాణించి నీటిని పరిశీలించారు. అనంతరం నది వెంట రెండు కిలోమీటర్ల వరకు సీఎం పాదయాత్ర చేశా రు. ఈ సందర్భంగా మూసీలో ప్రవహిస్తు న్న కలుషిత నీటిని చూసి చలించి పోయారు.
పాదయాత్రలో భాగంగానే స్థానిక రైతులు, మత్స్యకారులతోపాటు పలు వర్గాలకు చెంది న ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూసీ నీళ్లు స్థానిక చెరువుల్లో కలవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బం దులను ప్రజలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తాము పండించిన పంటను కొనడానికి ఎవ రూ ముందుకు రావడం లేదని, అలాగే కలుషిత నీటి వల్ల చేపలు కూడా చనిపోతుం డ టంతో నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశా రు. కలుషిత నీటి వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదక వ్యాధుల బారినపడి ఇప్పటికే అనేకమం ది చనిపోయారని వాపోయారు.
మూసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సీఎం చలించి పోయారు. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించి ప్రభుత్వం మంచి పని చేసిందని ప్రజలు కొనియాడా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ జీవితాల్లో వెలుగులు సీఎంను కోరారు. ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ఎట్టి పరిస్థితుల్లో ఆపమన్నారు.
బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి ఫైర్
మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర లో భాగంగా సంగెంలో ఏర్పా టు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు మూసీ పునరుజ్జీవ కార్య క్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాళ్లకు న్యాయమా? అంటూ ప్రశ్నించారు.
దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు నదిని ప్రక్షాళన చేసి తమను కాపాడాలం టూ నినాదాలు చేశారు. అసలు సినిమా ఉందం టూ బీఆర్‌ఎస్ నేతలను సీఎం హెచ్చరించారు. అంతే కాకుండా వాడపల్లి నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.