నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల కేంద్ర వద్ద ఇత్తనాలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతు జేఏసీ నాయకులు ఐక్యంగా పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించారని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన చర్చల్లో ప్రభుత్వం డిమాండ్లను ఒప్పుకోవడంతో ఆ డిమాండ్లను ఆందోళన చేస్తున్న రైతులకు వివరించి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రైతుల ఆందోళన జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఇన్చార్జ్ మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కలెక్టర్ జోక్యంతో మంత్రి సీతక్క ఆదేశాలతో రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని శాంతియుతంగా రెండు రోజుల పాటు ఆందోళన చేసిన రైతులు తమ పోరాటాన్ని నెగ్గించుకున్నారని ఎక్కడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన రైతులు తమకు సంపూర్ణ సహకార అందించారని ఆమె తెలిపారు.