calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్‌లో రైతు మహోత్సవం

19-04-2025 01:04:37 AM

  1. ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహణ
  2. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం లో రైతు మహోత్సవం నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ బీ గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

మహోత్సవానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వస్తారని, వారు పండించిన ఉత్పత్తులను రైతు మహోత్సవంలో ప్రదర్శిస్తారని, 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.