calender_icon.png 25 February, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు కోతలతో రైతులకు కష్టాలు

25-02-2025 04:00:44 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కరెంటు కోతలతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో దాదాపు 18 గంటల కరెంటు ఇచ్చిన సమయంలో పంట పొలాలకు సాగునీరు అంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదికాదని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం దాదాపు పది గంటలు మాత్రమే కరెంటు ఇవ్వడంతో సరియైన సాగునీరు అందక పంటలు ఎండుతుండడంతో పాటు తరచూ కోతలు పెడుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి వేళల్లో కరెంటు వస్తుందని పంట పొలాల వద్దకు రైతులకు నిరాశతో పాటు నిద్రలేకుండా కరెంటు కోసం ఎప్పుడు వస్తుందో అంటూ  ఎదురుచూడాల్సి వస్తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గతంలో మాదిరిగానే రాత్రి పది నుండి తెల్లవార్లు సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఏకకాలంలో 18 గంటల కరెంటు కోతలు లేకుండా ఇవ్వాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి,రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.