calender_icon.png 22 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లతో రైతులకు ఇబ్బందులు

22-04-2025 01:27:35 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజోత్సవ సభ ఏర్పాట్ల పేరు మీద రైతులకు చెందిన భూములను, దేవాదుల ఆయకట్టు ద్వారా వచ్చే కాలువలను ధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా పంట పొలాలను చెడగొడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామ శివారు, హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి గ్రామ శివారు లోని మైసమ్మ వాగు, మండల, గ్రామాల మధ్య హద్దులను సూచించే హద్దులను సభ కోసం తీసివేయడం దుర్మార్గమైన చర్య అని, సోమవారం రోజున వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు సరిహద్దు గ్రామాల ప్రజలతో స్వయంగా సభా స్థలాన్ని పరిశీలించారు.

ప్రభుత్వం ఏదైతే సభ కోసం పర్మిషన్ ఇచ్చినదో, దానికంటే ఎక్కువగా అవసరా నికి మించి రైతుల భూములను చెడగొడుతూ రాక్షసానందం పొందడం బిఆర్‌ఎస్ పార్టీకే చెందుతుందని అన్నారు. ఏ రోజు కూడా బిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే సభను అడ్డుకుంటామని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా హెచ్చరించలేదు, కానీ ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ ఇంకా అధికార పార్టీగా ఉన్నట్లు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  స్థానిక పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులను చేసి సభ కోసం విరాళాలు ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని అన్నారు. 

రైతుల భూములను, సరిహద్దు గ్రామాల హద్దులను అనుమతులు లేకుండా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్, ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వో, ఇరిగేషన్ సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రసేనరెడ్డి, పీసెస్ సభ్యు అశోక్ రెడ్డి, హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా, మండల, గ్రామ స్థాయి, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.