18-02-2025 12:00:00 AM
టీఏసీ ముందుకు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల
టీఏసీ అనుమతి రాగానే పనులు పరుగులు
సవరించిన ఎస్టిమేషన్ అనుమతి కోసం సీఎంకు తుమ్మల లేఖ
టీఏసీ అనుమతిస్తే ఈ ఏడాదిలోనే పనులు పూర్తి
ఖమ్మం, ఫిబ్రవరి 1౭ (విజయక్రాంతి)ః ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కల సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో నెరవేరబోతున్నది. మూడు జిల్లాలను సస్య శ్యామలం చేసే ఈ ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వ పరంగా కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగు తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిం చే ఈ ప్రాజెక్టును త్వరిగతిన పూర్తి చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల ను పరుగులు పెట్టించేందుకు కసరత్తు జరు గుతుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నూతనంగా రూపొందించిన డీపీఆర్‌కు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ (టిఏసీ) ఆమోదం లభిస్తే ఈ ఏడాదిలోనే పనులు చేపట్టేందుకు ఉవ్విళూరుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ కలను సాకారం చేసేందుకు మంత్రి ఢిల్లీ స్ధాయిలో పావులు కదుపుతున్నారు.
తుమ్మల దశాబ్ధాల రాజకీయ కల..
సీతారామ ప్రాజెక్టు తన దశాబ్ధాల రాజ కీయ జీవితానికి మైలురాయిగా ఉంటుం దని తుమ్మల పలు సందర్బాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మంత్రి తుమ్మల యుద్ద ప్రాతిపదికన చర్య లు తీసుకోవడంతో పనులు భవిష్యత్‌లో మరింత ముందుకు సాగే అవకాశం ఏర్ప డబోతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి నదిపై సీతమ్మ సాగర్ బ్యారేజీ, బ్యారేజీ వెనుక జలాల ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కు, మహబూబాబాద్ జిల్లాకు సాగు, తాగు నీటిని అందించేందుకు సీతారామ ఎత్తిపో తల పథకాన్ని తలపెట్టిన సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను అను మతుల కోసం ఢిల్లీలోని సాంకేతిక సలహా ల కమిటీకి గతంలోనే నివేదించింది.
ఎస్టిమేషన్ పనుల అనుమతికి సీఎంకు లేఖ
మంత్రి తుమ్మల ప్రత్యేక శద్ద తీసుకుని, ఈ దస్రాన్ని టిఏసికి నివేదించారు. అను మతులు కోసం సంబంధిత కేంద్ర మంత్రు లను కలిసి, కోరడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ప్రత్యేకిం చి, విజ్జప్తి చేయడంతో పాటు లేఖ కూడా అందజేశారు. త్వరితగతిన నిధులు కేటా యిస్తే పనులను ప్రారంభించేందుకు తుమ్మ ల సమాయత్తమవుతున్నారు.
అయితే తొలుత ఇందుకు సంబంధించిన రూపొం దించిన అంచనాలకు ఆమోదం లభించిం ది. తర్వాత అంచనాలు సవరించి, ఆమో దం కోసం రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిం చారు. సవరించిన ఎస్టిమేట్ పనులకు అనుమతులు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ పను లకు ఆర్ధిక శాఖ నుంచి అనుమతులు వస్తే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగ మం అవుతుంది.ప్రస్ధుతం ఆ దిశగా చర్య లు తీసుకున్నారు. జిల్లాలో సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సంపూర్ణంగా సస్యశ్యామలం అవుతుంది.
టీఏసీ ముందుకు ప్రాజెక్టు డీపీఆర్
అందులో భాగంగానే సీతారామ ప్రాజె క్టు సవరించిన అంచనాల ఆమోదానికి, టీఏసీ నుంచి అనుమతులు కోసం మంత్రి తుమ్మల తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందు కు సంబంధించిన దస్త్రం ఢిల్లీలోని టిఏసీ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇటీవ ల ఢిల్లీలో జరిగిన టీఏసీ సమావేశంలో సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబం ధించిన డీపీఆర్‌పై చర్చ జరిగిందని తెలిసింది.
ఈ క్రమంలోనే జిల్లా అధికారులను మంత్రి తుమ్మల అప్రమత్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధిం చిన ఇతర అనుమతులు వచ్చాయి.
టీఏసీ అనుమతి కూడా లభిస్తే ఈ ప్రాజెక్టులో నిర్మాణాలు చేపట్టడానికి మార్గం సుగమం అవుతుందంటున్నారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఉండే టీఏసీ సమావేశానికి రాష్ర్టం నుంచి ఈఎన్సీ అనిల్‌కుమార్, విజయభాస్కర్‌రెడ్డి, కొత్తగూడెం సీఈ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.