26-01-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల అర్బన్, జనవరి 25 (విజయక్రాంతి): జగిత్యాల మండలం అంబర్పేటలోని అర్బన్ పార్కులో ఈ ప్రాంత రైతులకు ఇలాంటి ఆంక్షలు విధించ కుండా స్వేచ్ఛగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని పట్ట బద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అంబారి పెట్ అర్బన్ పార్క్ ను ప్రజా ప్రతినిధులతో కలిసి జీవన్ రెడ్డి శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో భద్రతాపర మైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. అంబారిపేట్ రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు దారి ఇదేనని వారు ఈ పార్కులోకి ప్రవేశించేందుకు ఆంక్షలు ఉండకుండా చూడాలన్నారు. పార్కులోకి వచ్చే సందర్శకుల ఐడి ప్రూఫ్’తో రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే భద్రతా పరంగా బాగుంటుందని సూచించారు.