calender_icon.png 27 September, 2024 | 6:47 PM

కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు డెడ్‌లైన్

27-09-2024 04:41:36 PM

సిద్ధిపేట,(విజయక్రాంతి): రుణమాఫీ డిమాండ్ తో రైతులు శుక్రవారం నంగనూరులో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతులు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే వారని, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున 5 గంటలకు చెప్పులు  లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేదని, కాంగ్రెస్ రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టిందని తెలిపారు. కాని కేసీఆర్ సీఎం అయ్యాక  ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించినట్లు ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు .. కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇచ్చిండని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలకుండా రైతులకు కరెంటు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ ఇస్తే.. కేసీఆర్ మాత్రం 24 గంటలు కరెంట్ అందించాడు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఏదో మీటింగ్‌లో కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది.. ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను అడుగుతున్నారు. కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్టు. కరోనా వచ్చినప్పుడు 45 రోజులు  లాక్‌డౌన్ ఉంటే గవర్నమెంట్‌కి రూపాయి ఆదాయం లేదు. అయినా కేసీఆర్ రేషన్ కార్డు మీద రూ.1,500 లతో పాటు అందరికీ బియ్యం పంచి ఆదుకున్నాడు.