calender_icon.png 27 December, 2024 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిసిఐ అధికారులు దళారులకు అమ్ముడు పోతున్నారని రైతుల ధర్నా..

03-12-2024 06:33:53 PM

స్థానిక గ్రామంలోని రైతులపై సీసీఐ అధికారుల కక్ష సాధింపు చర్యలు

అదే గ్రామానికి చెందిన రైతులకు 80 నుండి మూడు వందల కేజీల పత్తి కటింగు

రైతులకు అన్యాయం జరిగితే మిల్లు కాంట్రాక్టర్ పై తగ్గిన చర్యలు తప్పవని హెచ్చరకలు

మునుగోడు (విజయక్రాంతి): మండలంలోని కొంపల్లి గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో సంబంధిత అధికారులు దళారులకు అమ్ముడుపోయి నేరుగా వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జెబి కాటన్ మిల్లు వద్ద స్థానిక రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. స్థానికంగా ఉండే గ్రామ రైతుల కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ ఒక ట్రాక్టర్లో సగటున 30 నుండి 40 క్వింటాళ్ల పత్తి ఉండడంతో తేమ, నాసిరకం పేరుతో 80 నుండి 300 కేజీల పత్తిని తరుగు చేస్తూ దాదాపు ఒక రైతును ఏడు నుంచి 20 వేల రూపాయలను నష్టపరుస్తూ దళారులు ఇచ్చే ముడుపుల మత్తులో రైతులను ఉన్నట్టెంటా ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సీసీఐ అధికారులు మిల్లు యాజమాన్యం, మధ్య దళారీలు కలిసి రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, మక్కెన అప్పారావు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు అన్యాయం జరుగుతే సహించమంటూ పత్తి రైతుల యొక్క పత్తి కటింగ్ పెట్టకూడదని సిసిఐ అధికారులను, మిల్లు యజమాని, కాంట్రాక్టర్ను హెచ్చరించారు. ధర్నా చేసిన వారు దాం నరసింహ, భీముడు మల్లయ్య, జాల రాములు, మోగదాల కుమార్, సూర మహేష్, సుర రమేష్, బోల్లేపల్లి కిరణ్, రాజు, సూర సురేష్ లు ఉన్నారు.