calender_icon.png 26 April, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యం శాపం

25-04-2025 01:17:01 AM

తరతరాలుగా సాగు... పట్టాలు రాక తీరని నష్టం 

22000 ఎకరాల రైతుల భూ సమస్య 

పరిష్కారం చూపాలని రైతుల డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): తరతరాలుగా సాగు చేస్తున్నారు... నిజాం కాలం నుంచి భూమిశిస్తు చెల్లిస్తున్నారు... పేరుకు సాగులో ఉన్న భూములకు పట్టాలు రాక ప్రభుత్వపరంగా అందాల్సిన పథకాలకు దూరమై తీవ్రంగా నష్టపోతున్నా రు. దశాబ్దాల నాటి తమ భూ సమస్యలను పరిష్కరించాలంటూ రైతుల ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి రెవె న్యూ గ్రామ రైతుల సమస్య ఇది. మండల పరిధిలో మొత్తం ఆరు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో బేతంపూడి అతిపెద్ద రెవె న్యూ గ్రామం. 16 పంచాయితీలో 22 వేల ఎకరాలకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా విడదీయరా అని చెక్కు ముడి పడింది. దీంతో ఆ రెవెన్యూ గ్రామాల రైతులకు పట్టా లు రాకుండా అడ్డుపడుతోంది. ఫలితంగా రైతుబంధు పంట రుణాలు విద్యుత్ లైన్లు బ్యాంకు రుణాలు రాక రైతులు లబోదిబోం అంటున్నారు. 

1956 నాటి భూములు...

బేతంపూడి రెవెన్యూ గ్రామంలో రైతులు 1956 నుంచి సాగు చేసుకుంటున్నారు. రెవె న్యూ పరిధిలో భూమి షష్తులు బ్లాక్ నెంబ ర్లో నిజాం కాలం నుంచి రికార్డుల ద్వారా వసూలు చేస్తున్నారు. 1986లో తాలూకాలు రద్దు చేసే మండల వ్యవస్థ ఏర్పాటు సమయంలో అధికారుల పొరపాటు రైతుల పాలిట శాపంగా మారింది.మొత్తం ఆరు రెవె న్యూ గ్రామాలుగా ఏర్పాటు చేయాల్సిన ఈ ప్రాంతాన్ని ఒకే రెవెన్యూ గ్రామంగా ఏర్పా టు చేయడమే అధికారులు చేసిన తప్పిదం. దేనికి తోడు గతంలో 6 పంచాయతీలుగా ఉన్న ఏ ప్రాం తం ప్రస్తుతం 16 పంచాయతీలుగా విభజింపబడ్డాయి. రెవెన్యూ పరంగా 22వేల ఎకరా ల భూమి ఉంది. రికార్డులను బేతంపూడి, సులానగర్ పేరుతో రెండు అ డంగల్ పహానిలు ఉన్నాయి.

మ్యానువల్ రికార్డుల సమయంలో అధికారులు ఎలాగో నెట్టకొచ్చారు. ఆ తర్వాత భూ రికార్డులు ఆన్లైన్ చేసిన నాటి నుంచి రైతుల కష్టాలు మొదలయ్యాయి. భూమిపై హక్కులకు భం గం వాటిల్లింది. రెండు అడంగల్ పహానీలో సర్వేనెంబర్ లను 1 నుంచి నమోదు చేశారు. అదే వారికి శాపం అయింది. బేతంపూడి పహానీలో 1నుంచి 68వ సర్వే నెంబరు  వరకు బేతంపూడి లోను, 1 నుంచి 48 సర్వేనెంబర్ వరకు కోయగూ డెం లోను, సోలానగర్ పహాని లో 1 నుంచి 68 వరకు సులానగర్, కోయగూడెం గ్రామాల్లో నమోదు చేశారు. 

దీంతో ఆన్లైన్ సమయంలో మూడు నెంబర్ల భూములు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఒకే సర్వేనెంబర్ కావడంతో రైతులకు పట్టాలు రాకుండా పోయాయి. ఇదిలా ఉండగా 169 నుంచి 336 సర్వే నెంబర్ల వరకు బేతంపూడి, కోయగూడెం, బద్దు తండా,కుంటల్ల, టేకులపల్లి,  రోల్లపాడు, 9వ మైల్ తండా, తడికల పూడి గ్రామపంచాయతీలో డబల్ సర్వే నెం బర్లు ఉండటంతో మొదట్లో ఆన్లైన్ చేసుకున్న రైతులకు మాత్రమే పట్టాలు జారీ అ య్యాయి. ఆ తర్వాత ఆన్లైన్ చేసిన రైతులకు పట్టాలు రాక ఇబ్బంది పడుతున్నారు.

337 సర్వే నెంబర్ నుంచి 10 74 సర్వేనెంబర్ వరకు ఉన్న భూములు ఒకే సర్వేనెంబర్ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా హక్కుల లభించాయి. కోయగూడెం ప్రాంతంలోని సర్వే నెంబర్ 169 లో రైతులకు 1956 నుంచి పట్టాలు ఉన్నాయి. కానీ సర్వేనెంబర్ ఒక చోట ఉండి భూములు వేరే, వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో పనిచేసిన అధికారులు సరైన పద్ధతిలో సర్వే నంబర్లు కేటాయించకపోవడంతో రైతులు నానా ఇబ్బంది పడుతుపరిష్కారంన్నారు. దశాబ్దాలుగా పట్టాలు రాక ప్రభుత్వ పథకాలు అందగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తమ చిరకాలపు సమస్యకు చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

భూభారతిలో సమస్యకు పరిష్కారం 

ఇంతకాలంగా బేతంపూడి, సులానగర్ అడంగల్ పహాని లో నెలకొన్న ఒకే సర్వే నంబర్ భూ సమస్య కారణంగా పట్టాలు రాకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిలో పరిష్కారం లభిస్తుందన్నారు.

-తాసిల్దార్ నాగ భవాని