- 30న మహబూబ్‌నగర్‌లో నిర్వాహణ
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్‌పై విజయోత్సవాలు
- ప్రభుత్వ పథకాలు గడప గడపకు చేరేలా ప్రచారం
- విజయోత్సవాల్లో అందరినీ భాగస్వాములు చేయాలి
- అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
- హాజరైన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క
హైదరాబాద్, నవంబర్ 22 ( విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుండటంతో ఈ సంవత్సర కాలంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను రాష్ర్టంలోని ప్రతి గడపగడపకు చేరవే సేలా విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆదేశించారు.
రాష్ర్టంలో ప్రజాప్రభు త్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలు ఇప్పటికే ప్రారంభించామ న్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థుల దినోత్సవం, వరంగల్‌లో మహిళా దినోత్సవం కార్యక్రమాలను పెద్దఎత్తున చేప ట్టామన్నారు.
ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్‌లో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. అదే విధంగా డిసెంబర్ 7, 8, 9 తేదీలలో హైదరాబాద్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాలలో కన్నుల పండువగా కార్నివాల్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భట్టి పేర్కొన్నారు.
ఈ మూడు రోజుల ఉత్సవాలలో మహిళలు, పిల్లలు, పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే, ప్రతీ జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని, అదేవిధంగా ప్రతీ గ్రామం, మండలం, జిల్లాస్థాయి వరకు విజయోత్సవాలు పండగ వాతా వరణంలో నిర్వహించాలని చెప్పా రు.
ప్రతీ శాఖలో ఈ సంవత్స ర కాలంలో అమ లు చేసిన పథకాలు, కార్యక్రమాలపై అంతర్గతంగా వేడుకలు నిర్వహించు కోవాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు.
సోషల్ మీడియాలో ప్రచారం..
ప్రభుత్వ విజయాలను ప్రతి వ్యక్తికి చేరవేసేలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను విస్తృతస్థాయిలో ఉపయోగించుకోవాలని భట్టి సూచించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలను, సక్సెస్ స్టోరీలను తమ వెబ్‌సైట్‌లో, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ రాష్ర్టంలోని 70 లక్షల స్వయం సహాయక మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీలు, సన్న వడ్లకు రూ.500 బోనస్ తదితర మహిళా సాధికారత పథకాల వివరాలన్నీ వారికి చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ ఫిలింలు, తదితర ప్రచార అంశాలను హోర్డింగులు, ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. రాష్ర్టంలో ఉన్న దాదాపు 25 వేల ఆర్టీసీ బస్సులపై ఈ హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ఏర్పాటు తదితర పథకాలపై విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ విజయోత్సవాలు పురస్కరించుకొని నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం, 200 విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారం భం, 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయడం, ఆరు ప్రధాన పాలసీలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వివరించారు.
ఈ సందర్భంగా విజయోత్సవాలా నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శు ల సలహాలు, సూచనలను డిప్యూటీ సీఎం భట్టి స్వీకరించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, శ్రీధర్, క్రిస్టినా జోంగ్టు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.