calender_icon.png 26 February, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సహకారం అభినందనీయం

26-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి 25: కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రతిఘటన అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి బహులార్ధ సాధక పారిశ్రామిక పార్కుకు దుద్యాల మండలం లగచర్ల గ్రామ సర్వేనెంబర్ 102 లోని 22 మంది రైతులకు సంబంధించిన 31.35 ఎకరాల భూమికి రూ. 6 కోట్ల 38 లక్షల నష్టపరిహారం చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మీ త్యాగాల ఫలితంగా కొడంగల్ ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సన్నదం అవుతుందన్నారు. రైతుల సహకారం వల్ల పరిశ్రమలు రావడంతో కొడంగల్ ప్రాంత అభివృద్ధితోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు.