calender_icon.png 4 March, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్ల కోసం రైతులు ఆందోళన

04-03-2025 12:00:00 AM

అధికారుల జోక్యంతో ప్రారంభమైన కొనుగోలు

ఆదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : పంటలు పండించే నాటి నుండి పండిన పంటను అమ్ముకునే వరకు రైతులు ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు తీసుకొచ్చిన పత్తి నాణ్యత లేదంటూ సీసీఐ కొనుగోలు నిలిపే వేయడంతో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు సోమవారం ఆందోళన దిగారు.

పత్తి నాసిరకంగా ఉందనే సాకుతో తీసుకోవడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన పత్తిని తీసుకొచ్చినప్పటికీ అధికారులు ఎదో ఒకసాగుతో కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించా రు.

తాము తీసుకువచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన దిగడంతో మార్కెట్ యార్డులో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి మార్కెట్ యార్డ్ ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించడంతో తిరిగి కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి.