19-04-2025 12:00:00 AM
కర్ణమామిడి, హాజీపూర్ గ్రామాల్లో కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు
జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదుతో స్పందించిన అధికారులు
మంచిర్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : ఓవైపు మబ్బులు.., మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు లబోదిబో మంటు న్నా రు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాల ను సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. హాజీపూర్ మండలం కర్ణ మామిడి, హాజీపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారం భించకపోవడంతో రైతులు చేసేదేమి లేక జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్ సివిల్ సప్లై శాఖ కార్యాల సిబ్బందికి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది కొనుగోలు కేంద్రాలను సందర్శించి వరి ధాన్యం రైతులు ఏ రోజు కేంద్రాన్ని తీసుకువచ్చారు, దాన్యం తేమ శాతం ఎంత ఉందో పరిశీలించి అధికా రుల కు నివేదిక అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీ లాల్ మాట్లా డుతూ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంచాలని, నిర్వాహకులు కేంద్రంలో ఉంటూ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, తేమ హరిన ధాన్యాన్ని తూకం వేయించి కేంద్రానికి ట్యాగింగ్ ఉన్న మిల్లుకు మాత్రమే ధాన్యాన్ని తరలించాలని ఏజెన్సీల నిర్వాహకులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.