calender_icon.png 22 November, 2024 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు కమిషన్ సూచనలు తీసుకోవాలి

22-11-2024 04:14:24 AM

మంత్రి తుమ్మల 

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : ఆదర్శ రైతుల నియా మకంపై రైతు కమిషన్ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకొని నివేదిక సమర్పించాలని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విత్తనచట్టంలో మార్పులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు.

వ్యవసాయరంగానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు మంత్రిని కలిసి కమిటీల నియమకాన్ని చేపట్టాలని కోరారు. త్వరలో ఈ కమిటీల ద్వారా విస్తరణ కార్యక్రమాలతో వ్యవసాయరంగానికి నూతనోత్తేజం కల్పించాలని సూచించారు.