calender_icon.png 12 February, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఖర్చు తగ్గించుకొని సాగులో దిగుబడి పెంచుకోవచ్చు

12-02-2025 05:18:53 PM

గోపాల్ పూర్ లో రైతులకు అవగాహనలో మంథని ఏడీఏ అంజనీ..

మంథని (విజయక్రాంతి): రైతులు ఖర్చు తగ్గించుకొని సాగులో దిగుబడి పెంచుకోవచ్చని మంథని మండలంలోని గోపాల్ పూర్ లో రైతులకు అవగాహనలో మంథని ఏడీఏ అంజనీ అన్నారు. బుధవారం గ్రామంలో యూరియా వినియోగం గురించి రైతులకు అవగాహన కార్యక్రమం ఏడీఏ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రాణులార్ యూరియా నానో యూరియా గురించి వివరించారు. నానో యూరియాని డ్రోన్ ద్వారా దాసరి విశ్వనాథ్ పొలంలో డెమోగా వేసి చూపించారు. దీని ద్వారా రైతులకు సాగులో ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవచ్చని ఏడీఏ అంజనీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంథని ఏఓ నవ్య, మండల ఏఈఓ లు, రైతులు పాల్గొన్నారు.